ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ పోరు మళ్లీ షురూ కాబోతోంది. గత నెలలో నాలుగు విడతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ్, వార్డు స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్, రాష్ట్ర వ్యాప్తంగా 725 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. ఎన్నికలు నిర్వహించే 12 సర్పంచ్, 725 వార్డులకు ఈ నెల […]