నిన్న మొన్నటి వరకు కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, వర్గాలతో నలిగిన పల్లెలు మారుతున్నాయి. ప్రజల చైతన్యంతో రాజకీయ కుట్రల కబంద హస్తాల నుంచి పల్లెలు విముక్తి పొందుతున్నాయి. పంచాయతీ ఎన్నికలంటే.. అసలు అర్థాన్ని గ్రహిస్తున్నాయి. సమష్టి నిర్ణయాలతో సమగ్రమైన అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నాయి. పార్టీ రహిత ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంటూ.. తమ బతుకులకు బంగారు బాటలు వేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చే ప్రొత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. సమస్యలెన్నో.. గ్రామాల్లో నేతలు పెంచి పోషించిన వర్గాల వల్ల సౌకర్యాలు లేకపోయినా.. […]
మేనిఫెస్టో.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో తెలిపే రాజకీయ పార్టీల ప్రమాణ పత్రం. ఈ మేనిఫెస్టోకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైన అనుబంధమే ఉంది. 2014లో అధికారంలోకి రావడానికి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాదాపు 650 హామీలే ప్రధాన కారణం కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని ఘనతను చంద్రబాబు పార్టీ సొంతం చేసుకుంది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరికి తమ మేనిఫెస్టోను […]
ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు. ఈ సమయంలో జోక్యం చేసుకోబోము. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి… ఇదీ ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న వివాదానికి పరిష్కారంగా దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు. సుప్రిం తీర్పును గౌరవిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ.. అందుకు అనుగుణంగా పని చేయడం ఆరంభించింది. అయితే రాష్ట్ర ఎన్నికల […]
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తన వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదని, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మాత్రమే తాను నిర్వహిస్తున్నానంటూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. సహేతుకంగా ఎన్నికలను నిర్వహిస్తున్నానంటూ చెప్పిన నిమ్మగడ్డ.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చేస్తున్న పని, తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైతే.. నిమ్మలంగా కూర్చుని మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారనే సందేహాలు సాధారణంగానే వినిపిస్తాయి. […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పీఠముడి వీడడం లేదు. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రకటించారు. రేపు తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. గతంలో ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరిన అధికారులను పక్కనపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమవడానికి సిద్ధమైనా.. వివిధ కారణాలతో వారు గౌర్హాజరయ్యారు. అవసరమైన సమాచారాన్ని నోట్ రూపంలో […]
ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయపరమైన వివాదాలు, ప్రభుత్వంతో గొడవలు, ఉద్యోగులపై వేటు వంటి నిర్ణయాలతో అత్యంత వివాదాస్పద అధికారిగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాబోయే రోజుల్లో మరింత వివాదాస్పదంగా వ్యవహరిచబోతున్నారా..? ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను తన వ్యక్తిగత అజెండా అమలుకు వినియోగించబోతున్నారా..? రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యాలు కొనసాగించబోతున్నారా..? ఎన్నికల నిర్వహణ పేరుతో విచ్చలవిడిగా అధికారం చెలాయించబోతున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. […]
స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం సుప్రిం కోర్టుకు చేరబోతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ జారీ చేసిన షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సదురు స్టేను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా.. ఇరు వైపు వాదనలను […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఉత్కంఠ మరికొన్ని రోజులపాటు కొనసాగే పరస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలను విన్న ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది తెలియాల్సి ఉంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. కరోనా వైరస్, వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సాధ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. […]
ఒంటెద్దు పోకడలు ప్రజా స్వామ్యానికి శ్రేయష్కరం కాదు. అలాంటి పోకడలను పాలకులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే కొంత మంది గతంలో వ్యవహారించినా.. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచింది. చరిత్ర ఇంత స్పష్లంగా ఉన్నా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లాంటి కొంత మంది అధికారులు అదే దారిలో నడుస్తుంటారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మేలుకున్నా.. అప్పడు చేసేదేమీ ఉండదు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పరిస్థితి కూడా ఇలానే ఉందంటున్నారు ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన అధికారాలను […]
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు.. ప్రజల్లో జగన్ ప్రభుత్వానికి అంతకంతకూ ఆదరణ పెరుగుతుండడం… మరోవైపు టీడీపీ ప్రతిష్ఠ మసకబారుతుండడంతో ఆయనలో ఒణుకు కనిపిస్తోంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అసహనం పెరుగుతున్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. ప్రజల మధ్య సామరస్య భావానికి తూట్లు పొడిచేలా దేవాలయాలపై దాడుల అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించాలని ప్రయత్నించడంపై టీడీపీ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. […]