ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై మేధావులు నెమ్మదిగా స్పందిస్తున్నారు. వైసీపీ అధినేత రాష్ట్ర అభివృద్ది విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై తమదైన శైలిలో గళం వినిపిస్తున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి నగరాల్లో రాజధాని వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై మేధావుల ఫోరం, యువజన సంఘాలు తమ గొంతకను ఏకధాటిగా వినిపించాయి. తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయంలో రాయలసీమ మేధావుల ఫోరం నేతృత్వంలో జరిగిన సదస్సులో ఫోరం కో ఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్లు, ఉమామహేశ్వరి, కళావతి, […]