ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తెలుగువాడి విజయపతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరేసిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం టాలీవుడ్ నే కాదు యావత్ సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతోంది. కేవలం రోజుల వ్యవధిలో ఇన్నేసి శుభవార్తలు వినాల్సి రావడం కుటుంబానికే కాదు ఫ్యాన్స్ ని అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. లేట్ ఏజ్ లోనూ ఇంత గొప్ప ఖ్యాతిని అందుకుంటున్న […]