ఇప్పటికే 182 దేశాలకు విస్తరించి ప్రపంచ మానవాళికి మహమ్మారిలా తయారైన కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే తమ వంతు బాధ్యతగా పలు చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెళ్ళిళ్ళు , జాతరలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని, ఆలయాలు, చర్చిలు , మసీదులకు వెళ్లకపొతే మంచిదని, సినిమా హాళ్ళు, పబ్లిక్ పార్కులు, మాల్స్ , జిమ్ములు మూసివేయాలని ప్రజలందరూ తమ విధిలో భాగంగా సేఫ్టి రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేసింది. […]