ఇన్స్టెంట్ లోన్‌యాప్స్ డొంక కదలడంతో వాటిల్లో చోటు చేసుకున్న అక్రమాలు కూడా ఒకొక్కటిగా బైటకు వస్తున్నాయి. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా, ఇక్కడి వారితో టైఅప్‌లు పెట్టుకోవడం.. సంస్థ డైరెక్టర్లుగా తమ ఉద్యోగులనే నియమించడం.. ఒకరికి ఇంకొకరికి సంబంధం ఉన్నట్లుగా తెలియకుండా తగు జాగ్రత్తలు పాటించడం వంటి ఏర్పాట్లు చూస్తుంటే తమ పాపం ఎప్పుడో ఒకప్పుడు పండుతుందని వీరికి ముందే తెలుసన్న విషయం బోధపడుతోంది. దీంతో ఎప్పుడు ముప్పు వస్తే అప్పుడు వెంటనే తప్పించుకునే పోయే […]
లోన్‌యాప్‌లను నిర్వహిస్తున్న ఓ నాలుగు కంపెనీల ఆరు నెలల టర్నోవర్ రూ. 21 వేల కోట్లు ఉంటుందని దర్యాప్తు అధికారులు బైటపెట్టారు. లోన్ యాప్‌ల కారణంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో తమకు అందిన ఫిర్యాదుల మేరకు పోలీసు యంత్రాంగం ఈ యాప్‌లపై దృష్టిపెట్టింది. దీంతో వీటి లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి మొత్తం ఆరు కంపెనీలపై దర్యాప్తు చేపట్టారు. వీటిలో నాలుగు కంపెనీలు జూన్ నుంచి నవంబరు మధ్య 21 వేల […]
ఆన్లైన్ లోన్ యాప్స్, మనీ లెండింగ్ యాప్స్.. పేరేదైనా గానీ వ్యాపారమే ప్రథమ లక్ష్యం. కోవిడ్ కారణంగా కష్టమర్లు రాక అనేకానేక వ్యాపారాల నిర్వాహకులు మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. కానీ అదే కోవిడ్ ఈ యాప్‌లకు కావాల్సిన కష్టమర్లను తయారు చేసింది. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన బాధితులు ఈ లోన్ యాప్స్‌ను ఆశ్రయించి అప్పులు తీసుకుంటున్నట్లుగా పలు నివేదికల ద్వారా వెల్లడవుతోంది. లాక్డౌన్ కాలంలో దాదాపుగా పది లక్షలకు పైగా కష్టమర్లు ఈ యాప్‌లకు యాడ్ […]