రోజుకు 20 కోట్ల రూపాయలు వసూలు చేయాలి.. లోన్ యాప్ సంబంధిత కాల్సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి పెడుతున్న టార్గెట్ ఇది. లోన్యాప్ల కారణంగా జనం ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీస్శాఖ అప్రమత్తమైంది. దీంతో యాప్ నిర్వాహకులను బైటపెట్టేందుకు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన రోజుకో లీల వెలుగుచూస్తోంది. తెలంగాణా పోలీస్లు ఢిల్లీలో అయిదుగురు, హైదరాబాదులో ఆరుగురు వ్యక్తులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోవడంతో విచారణలో పురోగతి సాగుతోంది. అప్పులు తీసుకుంటున్న వాళ్ళ నుంచి రికవరీ […]