రద్దు యోచన : కమిటీ సభ్యుడు డిక్ పాండ్ ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ క్రీడా సంరంభం మీద కూడా పడింది. కరోనా కారణంగా జులై 24 నుంచి ఆగస్టు 7 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కూడా రద్దయ్యే సూచనలున్నాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పాండ్ మాట్లాడుతూ మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలోకి రాకుంటే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించారు. […]