iDreamPost
android-app
ios-app

టోక్యో ఒలింపిక్స్ పై కరోనా దెబ్బ !!

టోక్యో ఒలింపిక్స్ పై కరోనా దెబ్బ !!

రద్దు యోచన : కమిటీ సభ్యుడు డిక్ పాండ్

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం అంతర్జాతీయ క్రీడా సంరంభం మీద కూడా పడింది. కరోనా కారణంగా జులై 24 నుంచి ఆగస్టు 7 వరకు జపాన్ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్ కూడా రద్దయ్యే సూచనలున్నాయి.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సీనియర్ సభ్యుడు డిక్ పాండ్ మాట్లాడుతూ మే నెల చివరి నాటికి కొవిడ్-19 నియంత్రణలోకి రాకుంటే టోక్యో ఒలింపిక్స్ 2020ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించారు. కొవిడ్ 19 వ్యాపిస్తున్నందున ఈ వేసవికాలంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం చాలా ప్రమాదకరమని రుజువైతే క్రీడలను పూర్తిగా రద్దు చేస్తామని డిక్ పౌండ్ చెప్పారు. ఒలింపిక్స్ వాయిదా వేయడం, లేదా మరో ప్రాంతానికి తరలించడం కంటే పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ లో ప్రారంభమైన కొవిడ్ -19 వల్ల 2,715 మంది మరణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఒలింపిక్స్ నిర్వహణపై పడింది.ఈ వైరస్ చైనాలోనే కాకుండా దక్షిణ కొరియా, మధ్య తూర్పు దేశాలు, ఐరోపా ఖండంలో ప్రబలింది. కొవిడ్ 19 వల్ల జపాన్ దేశంలోనే నలుగురు మరణించారు. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా గతంలో ఒలింపిక్స్ రద్దు చేశారు.

కరోనా వైరస్ ప్రబలంగా ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. ఈదేశంలో వందలాదిమంది ఈ వ్యాధిబారిన పడగా పలువురు మరణించారు. ఇక ఒలింపిక్స్ క్రీడలకు వేలాదిమంది అథ్లెట్స్ ఇంకా లక్షల్లో క్రీడా ప్రేమికులు, ఇంకా పర్యాటకులు టోక్యో వస్తారు. ఒకేసారి అంతమంది గుమిగూడితే ఆ ఇన్ఫెక్షన్ మరింత వేగంగా వ్యాపిస్తుందని ,అది ఇంకా ప్రమాదరమైన పరిస్థితికి దారితీస్తుందని భయపడుతున్నారు.