బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కొత్త సినిమాల విడుదల తేదీలు గంపగుత్తగా వచ్చేస్తున్న తరుణంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం తొలగి పోవడం లేదు. తాజాగా 2022 జనవరి 12కే రావాలని నిర్ణయించుకున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మీడియాలో దీని గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అదే డేట్ ని లాక్ చేసుకున్న భీమ్లా నాయక్ ఏం చేస్తాడనేది మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఇది […]
మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు తెరుచుకోవడానికి\ అక్టోబర్ 22 నుంచి అనుమతులు ఇవ్వడం ఆలస్యం నిన్న ఒక్క రోజే 14కి పైగా బాలీవుడ్ సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించాయి. అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దాను 2022 ఫిబ్రవరి 14కి లాక్ చేయగానే నిమిషాల వ్యవధిలో ప్రకటనలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఈ ప్రవాహం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏకంగా 2023 దాకా ఒక్కొక్కరు విడుదల తేదీలను చెప్పేసుకుంటూ […]