iDreamPost
android-app
ios-app

రిలీజ్ డేట్ ని జక్కన్న డిసైడ్ అయ్యారా

  • Published Sep 28, 2021 | 11:08 AM Updated Updated Sep 28, 2021 | 11:08 AM
  • Published Sep 28, 2021 | 11:08 AMUpdated Sep 28, 2021 | 11:08 AM
రిలీజ్ డేట్ ని జక్కన్న డిసైడ్ అయ్యారా

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా కొత్త సినిమాల విడుదల తేదీలు గంపగుత్తగా వచ్చేస్తున్న తరుణంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడనే సస్పెన్స్ మాత్రం తొలగి పోవడం లేదు. తాజాగా 2022 జనవరి 12కే రావాలని నిర్ణయించుకున్నట్టుగా ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మీడియాలో దీని గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అదే డేట్ ని లాక్ చేసుకున్న భీమ్లా నాయక్ ఏం చేస్తాడనేది మాత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే క్లారిటీ వస్తుంది. ఇది కాకుండా సర్కారు వారి పాట, రాధే శ్యామ్ లు కూడా బరిలో ఉన్నాయి. ఎవరూ వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరి ఆర్ఆర్ఆర్ ఎందుకింత సాహసం చేస్తుందన్నది పెద్ద ప్రశ్న

త్వరలోనే ప్రకటన రావొచ్చని ముంబై మీడియా గట్టిగానే చెబుతోంది. కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇక్కడ చాలా సమీకరణాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పటికైతే సంక్రాంతికి సౌత్ సినిమాలు మాత్రమే ఫిక్స్ అయ్యాయి. బాలీవుడ్ వి జనవరి మూడో వారం నుంచి ప్లాన్ చేసుకున్నారు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ కు పెట్టిన బడ్జెట్, జరిగిన బిజినెస్ కోణంలో చూసుకుంటే పండగ లేదా వేసవి ఈ రెండు మాత్రమే మంచి ఆప్షన్లు. ఒకవేళ సమ్మర్ అనుకుంటే వడ్డీల భారం పెరిగిపోతుంది. డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి చేస్తారు. ఆ సమయానికి థియేటర్లు పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయమైనా ఇప్పుడే తీసుకోవాలి.

ఆలస్యం అమృతం విషం సామెత ఇక్కడ గుర్తొస్తోంది. అయితే రాజమౌళి ఎవరేమనుకున్నా పర్లేదు ఢీకి రెడీ అంటారా లేక ఎందుకు రిస్క్ అనుకుని మిగిలిన వాళ్ళు తప్పుకుంటారా అనేది వేచి చూడాలి. మొత్తానికి మరోసారి ఆర్ఆర్ఆర్ రిలీజ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో చర్చ జరిపితే పుష్ప కనక క్రిస్మస్ కి రాకపోతే అదొక డేట్ లేదా సంక్రాంతి తప్ప ఇంకే ఇతర ఆప్షన్ పెట్టుకున్నా వర్కౌట్ కాదని చెప్పేశారట. త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ తరఫున ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న తరుణం నిజంగా వస్తుందంటారా

Also Read : డిజిటల్ కే జై కొట్టిన మల్టీ స్టారర్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom