అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లతో గొల్లపూడిలో ఈ రోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీ రామారావు విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు సిద్ధం కావడంతో ఈ రోజు ఉదయం నుంచి గొల్లపూడిలో సెక్షన్ 144, సెక్షన్ 30ని అమలు చేశారు. […]