తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తాజాగా హైదరాబాద్లో ఎదురైన పరిస్థితిని చూసి తమ్ముళ్లు బావురమంటున్నారు. తెలంగాణ రాజకీయ అంశాల్లో వేలుపెట్టే అవకాశం పోయినా.. కనీసం పార్టీ కార్యక్రమాలు కార్యాలయం వెలుపల నిర్వహించుకునే అవకాశం చంద్రబాబుకు లేని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ భవన్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. 40 కేజీల కేక్ను కట్ చేసి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత […]