ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖపై చంద్రబాబునాయుడు ఇపుడు ఉలికిపడుతున్నాడు. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖపై దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలంటూ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై చంద్రబాబుతో పాటు టిడిపిలో కూడా టెన్షన్ మొదలైనట్లే ఉంది. స్ధానికసంస్ధల ఎన్నికల వాయిదా అంశం ఎంత వివాదం రేగిందో అందరూ చూసిందే. ఆ తర్వాత నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు ఓ లేఖ అందింది. […]