స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేంద్రంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కొద్దిసేపటి క్రితం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై కొడాలి నాని పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. తనపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎన్నికల నిర్వహణపై తాను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంటే.. […]
కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో.. ప్రజల శ్రేయస్సు, ప్రభుత్వ అభిప్రాయంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణే తన లక్ష్యమంటూ సాగుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆయన ప్రవర్తన చిన్నపిల్లాడి మాదిరిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ కేసులు లేనప్పుడు దాన్ని సాకుగా చూపి ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. నేడు లక్షల సంఖ్యలో కేసులు నమోదై.. దాదాపు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయి, ఇంకా […]
రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న బేధాభిప్రాయాలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ, కరోనా వల్ల ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్న వేళ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల సన్నద్ధతపై బుధవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని నిమ్మగడ్డ కోరగా.. ఎన్నికల నిర్వహణే ఇప్పట్లో కాదంటే.. సమావేశం అవసరం లేదని సీఎస్ ప్రత్యుత్తరం పంపారు. ఈ విషయంపై […]