నేడు నెల్లిమర్ల సంస్మరణ దినోత్సవం. జనపనార పరిశ్రమ విస్తరిస్తున్నా నేటికీ నెల్లిమర్ల కార్మికుల జీవితాల్లోకి వెలుగులు మాత్రం ప్రసరించడంలేదు. భవన నిర్మాణ కార్మికుల కంటే తక్కువ కూలీకి పని చేయాల్సి వస్తోంది. ఇరవైఐదు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున కార్మికోద్యమ చరిత్రలో ” నెల్లిమర్ల” నెత్తుటి మైలు రాయిగా మారింది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్ మిల్ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయాలని కోరుతూ జరిగిన రైల్ రోకోపై పేలిన పోలీసు తూటాలకు ఐదుగురు కార్మికులు మృతి […]