iDreamPost
android-app
ios-app

బాలయ్య మీద నో రిస్క్

  • Published Jan 07, 2020 | 10:55 AM Updated Updated Jan 07, 2020 | 10:55 AM
బాలయ్య మీద నో రిస్క్

నందమూరి బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. ఒకప్పుడు కేవలం ఈయన పేరు మీదే అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేవి. మాస్ ఇమేజ్ లో చిరంజీవి తర్వాత ఇంకోమాటలో చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన కంటే ఎక్కువ మార్కెట్ ఉండటం బాలయ్య ప్రత్యేకత. కాని కాని అదంతా గతం. వర్తమానం చూస్తే దీనికి టోటల్ రివర్స్ లో ఉంది. అర్థం పర్థం లేని హీరోయిజం ఉన్న కథలను అభిమానులు కూడా మెచ్చరని రూలర్ ఫలితం వసూళ్ళ సాక్షిగా రుజువు చేసింది.

పెట్టుబడిలో కనీసం పావలా వంతు తేవడానికే అష్టకష్టాలు పడిందీ సినిమా. డిజాస్టర్ అనే మాట కూడా చిన్నదేమో. దీనికన్నా ముందు వచ్చిన ఎన్టీఆర్ రెండు భాగాలది కూడా ఇదే స్టొరీ. డెబ్బై కోట్ల వ్యాపారం చేస్తే వెనక్కు వచ్చింది కేవలం ఇరవై కోట్లు. ఇదంతా చూసి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. సింహా. లెజెండ్ టైంలో తన సత్తా చూపించిన బాక్స్ ఆఫీస్ హీరో కేవలం ఒక ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

అందుకే బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వినికిడి. ఇప్పటికే బడ్జెట్ ని బాగా తగ్గించేశారుట. బోయపాటి కూడా వినయ విదేయ రామ రూపంలో పరాభవం పొంది ఉన్నాడు కాబట్టి నిర్మాత మరీ ఎక్కువ రిస్క్ చేయలేని పరిస్థితి.

అందుకే ముందు రాసుకున్న భారీ యాక్షన్ ఎపిసోడ్లు తగ్గించేసి ఎంత అవసరమో అంతే పెట్టి లెంత్ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నట్టు వినికిడి. గత పదేళ్ళ కాలంలో బాలయ్యకు రెండే పెద్ద హిట్లు ఇచ్చిన దర్శకుడు బోయపాటి ఒక్కడే. అందుకే సెంటిమెంట్ గా హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది కాని మిగిలినవాళ్ళలో దీని మీద ఇప్పటికిప్పుడు ఆసక్తి ఏమి లేదు. బాలయ్య బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇది మాములు హిట్ అయితే సరిపోదు. లేదంటే బాలకృష్ణ కెరీర్ రిస్క్ లో పడ్డట్టే