iDreamPost
iDreamPost
టాలీవుడ్ పరంగా కంటెంట్ పరంగా ఎన్ని ప్రమాణాలు పెరుగుతున్నా మాస్ సినిమాకుండే ఆదరణే వేరు. స్టార్లకు సరైన కంటెంట్ పడాలే కాని రికార్డుల ఊచకోత ఖాయమని గతంలో చాలా సార్లు రుజువయ్యింది. కోట్లాది రూపాయల మార్కెట్ ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. అందులోనూ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పేదేముంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఓ అరుదైన సందర్భంలోనిది. 1993లో విడుదలైన నిప్పురవ్వ మూవీ అప్పటిదాకా బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం. బొగ్గు గనుల నేపధ్యంలో దర్శకుడు కోదండరామిరెడ్డి దీన్ని రూపొందించారు.
బప్పిలహరి పాటలు స్వరపరచగా ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతాన్ని సమకూర్చారు. దీని ఓపెనింగ్ రోజు తాలుకు పిక్ ఇది. తమిళ సూపర్ స్టార్ రజనికాంత్, మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా ఓ గుడిలో ముహూర్తం షాట్ తీశారు. కాని ఈ నిప్పురవ్వ ప్రారంభోత్సవం 1989లో జరిగింది. ఐదేళ్ళ తర్వాత కాని రిలీజ్ కు మోక్షం కలగలేదు. టీంలో జరిగిన మార్పులు భారీ బడ్జెట్ కావడంతో కాస్ట్ కంట్రోల్ తప్పిపోయింది.
స్క్రిప్ట్ లోనూ చేంజెస్ జరగడం లాంటి కారణాల వల్ల లేట్ గా వెలుగులోకి వచ్చింది కాని బాలయ్య మరో సినిమా బంగారు బుల్లోడు కూడా సెప్టెంబర్ 3న అదే డేట్ కి విడుదల కావడం అందులో కంటెంట్ మాస్ కి బాగా కనెక్ట్ కావడంతో నిప్పురవ్వ దెబ్బతింది. ఇక్కడ పిక్ లో మరో విశేషం ఏంటంటే ఇప్పటికీ వీళ్ళు తెరమీద స్టార్లుగానే వెలుగొందుతున్నారు. విజయశాంతి ఇటీవలే సరిలేరు నీకెవ్వరుతో కం బ్యాక్ ఇవ్వగా బాలయ్య, మోహన్ లాల్, రజనికాంత్ తమ తమ బాషలలో యమా బిజీగా ఉన్నారు. నిప్పురవ్వ ఫ్లాప్ అయినా దాని మేకింగ్, మ్యూజిక్ కి దాన్ని ఇష్టపడే అభిమానులు చాలానే ఉన్నారు.