మన బతుకు మనం బతుకుతున్నప్పుడు ఎవరూ మన జోలికి రారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాక రాళ్లు పడుతుంటాయి, పూలు పడుతుంటాయి. పూలు పడినప్పుడు పల్లికిలించి.. రాళ్లు పడినప్పుడు మొహం చిట్లించడం రాజకీయాల్లో కుదరదని చెబుతుంటారు. పొగడ్తలైనా, విమర్శలైనా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో ఉన్నవాళ్లు తప్పక తీసుకోవాల్సిందే. విమర్శలను మేము తీసుకోం, సహించబోం అంటే.. ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం. ఇది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఉన్న వారిపై విమర్శలు సహజం. వాటిని ఎలా […]