నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కుతూనే ఉన్నాయి. ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అయితే దానికి దీటుగా మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు మాత్రం ప్రచారం చేయకపోవడం ఇక్కడ కొసమెరుపు. దీని వెనక కూడా రాజకీయ వ్యూహంలో గమనార్హం. ఈనెల 17న సాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. 15 […]
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక్కడినుంచి ఎన్నికల బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయనుంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా..? రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. జనసేన […]
మరో ఉప ఎన్నిక రాజకీయాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. నోముల నర్సింహయ్య మృతితో ఖాళీ అయిన నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్, బీజేపీ సహా.. కాంగ్రెస్ కూడా ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకే పీసీసీ చీఫ్ నియామకంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డికి స్థానికంగా ఉన్న పేరు, బలంతో ఆ స్థానంలో గెలుపొందాలని భావిస్తోంది. మిగతా పార్టీల సంగతి ఎలాగున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి […]
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, ఆ ప్రాంతంపై గట్టి పట్టు ఉన్న జానారెడ్డి పోటీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. […]