గత శుక్రవారం చేపల మార్కెట్ ని తలపించేలా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసిన చిన్న సినిమాలు ఏవీ కమర్షియల్ పరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముఖచిత్రం, పంచతంత్రం లాంటివి ప్రత్యేకంగా అనిపించినా వాతావరణ పరిస్థితుల వల్ల జనం పెద్దగా థియేటర్లకు రాలేకపోయారు. ఇప్పుడు డిసెంబర్ 16 రానుంది. అవతార్ 2కు భయపడి చెప్పుకోదగ్గ రిలీజులేవి ప్లాన్ చేయలేదు. శాసనసభ అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ ఒకటి వస్తోంది కానీ దాని మీద ఏమంత […]
నిన్న చాలా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. పేరుకి పదికి పైగానే విడుదలైనా జనాల దృష్టి పడిన వాటిలో ముఖచిత్రం ముందువరసలో ఉండగా పంచతంత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకుని వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంది. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం పికపయ్యే సూచనలు కనిపించడం లేదు. పబ్లిసిటీ లోపం వల్ల విజయానంద్ ప్రేక్షకుల దాకా వెళ్లలేకపోయింది. లెహరాయి లాంటి వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గత వారం రిలీజై నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ […]
ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మారిపోయింది. నాలుగు పంచ్ డైలాగ్ లు, ఐదు ఫైట్ లు, ఆరు పాటలతో ఏదో తీసేస్తే చూసే రోజులు కావివి. హీరో, డైరెక్టర్ ఎవరన్నది కాదు.. కథాకథనాల్లో కొత్తదనం ఉండాలి.. అప్పుడే ప్రేక్షకులు చిత్రాలను ఆదరిస్తున్నారు. అందుకే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలా విభిన్న కథాంశంతో ప్రేక్షులముందుకు వచ్చిన చిత్రమే ముఖచిత్రం. ముఖచిత్రం ట్రైలర్ చూసినప్పుడే ఈ సినిమా కాస్త కొత్తగా […]
ఇవాళ బాక్సాఫీస్ చిన్న సినిమాల తాకిడితో తడిసి ముద్దయ్యింది. పదికి పైగానే ప్రేక్షకులను పలకరించేందుకు థియేటర్లలో అడుగు పెట్టాయి. అందులో అంచనాలు ఉన్న వాటిలో మొదటిది ముఖ చిత్రం. తారాగణం అంతగా పరిచయం లేనిదే అయినా ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడం, విశ్వక్ సేన్ లాయర్ గా ప్రత్యేక పాత్ర పోషించడం లాంటి కారణాలు అంచనాలు రేపాయి. కలర్ ఫోటోతో జాతీయ అవార్డు అందించిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి రచన చేయడం విశేషం. ప్రీమియర్ నుంచే […]
మాములుగా ప్రతి శుక్రవారం మూడు నాలుగు కొత్త రిలీజులు వస్తేనే మూవీ లవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అంచనాలు లేనివి లైట్ తీసుకుని మిగిలినవాటికి థియేటర్లకొస్తారు. కానీ ఏకంగా 15 సినిమాలు బాక్సాఫీస్ మీదకు కలబడితే దాన్నేమనాలి. డిసెంబర్ 9 దీనికి వేదిక కాబోతోంది. అవేంటో చూద్దాం. గాడ్ ఫాదర్ తో యాక్టర్ గా తన స్థాయిని పెంచుకున్న సత్యదేవ్ మొదటిసారి తమన్నాతో జట్టు కట్టిన ‘గుర్తుందా శీతాకాలం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే చాలా వాయిదాల తర్వాత […]