తెలంగాణలో మొదలైన రాజకీయ భూ ప్రకంపనలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ప్రభుత్వం, ఈటల మధ్య కొనసాగుతున్న ఈ లొల్లి పై ఓ వైపు దుమారం రేగుతుండగా, తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కొత్త వివాదాలను తెరపైకి తెచ్చారు. ఈటల వ్యవహారం అలా ఉంటే, భూ కబ్జాలపై తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనయుడు కేటీఆర్, […]
తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జునసాగర్ లో వ్యూహాత్మక పోటీ ఏర్పడింది. కొంత కాలంగా తెలంగాణలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఇక్కడ పోటీ జరుగుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. ఫలితాల అనంతరం కూడా ఆ రెండు పార్టీలే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. కానీ, నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదే అదునుగా వరుస ఎన్నికల్లో ఓటమితో […]
తెలంగాణలో మరోమారు ప్రోటోకాల్ వివాదం తెరమీదికికొచ్చింది. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపేటలో ఓ వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీర్ పాల్గొన్నారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయంలో అధికార పార్టీ తీరును తప్పుబడుతూ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా కొత్తపేటలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. […]