ఓటీటీల వల్ల థియేట్రికల్ రిలీజు, వాటితో ముడిపడిన అంశాలతో ఎప్పుడూ ఏదో ఒక దుమారం రేగుతూనే ఉంటుంది. తాజాగా ఓటీటీలు తీసుకొస్తున్న పేమెంట్ సిస్టమ్ తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయని అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఓటీటీ ప్రవేశపెట్టిన ఈ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఇబ్బంది పడేది ఎగ్జిబిటర్లే. థియేటర్లో సినిమా పడిన మూడు వారాలకే ఓటీటీలో ప్రసారమవ్వడంతో తల పట్టుకుంటున్నారు. ఓటీటీలు ఈ పేమెంట్ సిస్టమ్ ను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్తున్నారు. పెద్ద […]
రేపు విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ థియేటర్లు బ్యానర్లే కాదు ముళ్ళూ, మేకులు, కంచెలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇద్దరు హీరోల మల్టీ స్టారర్ అందులోనూ కొణిదెల నందమూరి కాంబినేషన్ కావడంతో అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని గుర్తించిన యాజమాన్యాలు దానికి తగ్గట్టే స్క్రీన్ దగ్గర కంచెలు, మేకుల షీట్లు పెడుతున్నాయి. ఎవరైనా అత్యుత్సాహంతో తెరవద్దకు వెళ్లి డాన్స్ చేయాలన్నా, గుంపుగా వెళ్లి అక్కడ గొడవ చేయాలన్నా సాధ్యం కాదన్న మాట. ఈ మధ్యే ఓ హాలులో భీమ్లా […]
కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో థియేటర్లు, ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని అయోమయం మధ్య మన తెలుగు నిర్మాతలు ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి త్వరగా ఇస్తాయో లేదో కూడా తెలియదు. ఈ గందరగోళం మధ్య ఓటిటిలు భారీ ఆఫర్లతో ప్రొడ్యూసర్లను ఊరిస్తున్నారు. ఎంతగా అంటే తమ పెట్టుబడితో పాటు నిర్మాతలు మంచి లాభాన్ని వెనకేసుకునే లెవెల్ లో. కాని ఒక్కసారి ఈ పోకడ మొదలైతే తర్వాత జరిగే పరిణామాలు ఊహకందడం […]
కరోనా తాలూకు ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. జనజీవనం ఎప్పుడు మాములు స్థితికి చేరుతుందో అర్థం కావడం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడం లేదు. థియేటర్లు మూతబడి రెండు వారాలు దాటేసింది. లాక్ డౌన్ పుణ్యమాని అవి మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మైంటెనెన్స్ స్టాఫ్ లేక లోపల సీట్లు, ఎక్విప్మెంట్, ఏసీలు ఏ కండిషన్ లో ఉంటాయో ఊహించుకోవడానికి కూడా భయం వేస్తోంది. […]
ఇప్పటికే 182 దేశాలకు విస్తరించి ప్రపంచ మానవాళికి మహమ్మారిలా తయారైన కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే తమ వంతు బాధ్యతగా పలు చర్యలు చేపడుతున్నాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెళ్ళిళ్ళు , జాతరలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని, ఆలయాలు, చర్చిలు , మసీదులకు వెళ్లకపొతే మంచిదని, సినిమా హాళ్ళు, పబ్లిక్ పార్కులు, మాల్స్ , జిమ్ములు మూసివేయాలని ప్రజలందరూ తమ విధిలో భాగంగా సేఫ్టి రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేసింది. […]