తాడిపత్రిలో రాజకీయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. లేనిపోని వివాదాలు రేపి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నారనే వ్యాఖ్యలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆయన వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని హత్యా ఆరోపణలు చేశారని తెలుస్తోంది. తనను చంపించే ందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం చర్చనీయాంశమైంది. తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ ఫ్యాక్షన్ […]