మైక్రోసాఫ్ట్ కార్ప్ ఎక్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు. 26 సంవత్సరాల జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో జన్మించారు. జైన్ మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. అంతేకాక ఈ ఇమెయిల్లో సత్య నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని కూడా ఉద్యోగులను కోరారు. 2014లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, సత్య నాదెళ్ల వికలాంగ వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కంపెనీ ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి […]