అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త తో విచారణ జరిపించాలని ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించింది. ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఇన్సైడర్ ట్రేడింగ్‌పై తీర్మానం ప్రవేశపెట్టింది. హోంమంత్రి మేకతోటి సుచరిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి.. చర్చను ప్రారంభించారు. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన ఆధారంగా 4,070 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని […]