సముద్రం అందరిదీ కానీ, అన్ని సముద్రాలు ఒక్కలా ఉండవు. మెరీనా బీచ్లో ఒకలా కనిపిస్తుంది. రుషికొండలో ఇంకోలా, గోవాలో కొంచెం ఖరీదుగా కనిపిస్తుంది. మనుషుల కోలాహలం ఉంటేనే సముద్రానికి విలువ. లేదంటే అది పిచ్చెక్కినదానిలా ఒంటరిగా వుంటుంది. మెరీనాలో సముద్రం చైతన్యంగా కనిపిస్తుంది. చిన్నచిన్న వస్తువులు అమ్ముకునేవాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. మురుకులు, వేరుశనక్కాయలు, చేపలతో బజ్జీలు ఇంకా చాలాచాలా కనిపిస్తాయి. సాధారణమైన జనం ఎక్కువగా ఉంటారు. సముద్రం ఇక్కడ బతుకుతెరువు. రుషికొండలో మధ్యతరగతి కనిపిస్తుంది. మరీ అంత […]