నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, ఆ ప్రాంతంపై గట్టి పట్టు ఉన్న జానారెడ్డి పోటీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. […]