టీపీసీసీ కోసం ఆ రాష్ట్ర నేతలు చేస్తున్న విన్నపాలు, పైరవీలు, ఆ పదవికి ఆయన అర్హుడు కాదని ఒకరు.. ఈయన అర్హుడు కాదని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం.. ఒకరు తర్వాత మరొకరు ఢిల్లీక రావడం, పోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిని నియమించే వ్యవహారం తమకు తలనొప్పిగా మారినట్లు భావిస్తోంది. అధిష్ఠానంపై రకరకాల ఒత్తిళ్లు తేవడం, ఢిల్లీ యాత్రలు చేపట్టడం పార్టీ పెద్దలకు చికాకుగా మారింది. […]