టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ తీయాలంటే ఉన్న ప్రధానమైన రిస్క్ అభిమానుల అంచనాలు అందుకోలేకపోవడం. ఇద్దరు హీరోలను పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్స్ లెక్కలు వాళ్లకు విడిగా ఉంటాయి. కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా గొడవలు జరిగిపోతాయి. అందులోనూ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిక్కు అధికంగా ఉంటుంది. నటభూషణ శోభన్ బాబు గారికి 1985లో మహాసంగ్రామం ఇలాంటి పాఠమే నేర్పితే ఇకపై ఇంకో హీరో ఉన్న సినిమాలు చేయనని ప్రకటించి అలాంటి కథలు […]
ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి 14 సినిమాల్లో కలిసి నటించడం ఇప్పటికీ అన్ బీటబుల్ రికార్డుగా నిలిచిపోయింది. ఎన్ని తరాలు మారినా దాన్ని ఎవరూ చెరపలేకపోయారు. కనీసం ఏ ఇద్దరూ చిన్న హీరోలు కలిసి అన్నేసి సినిమాల్లో నటించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. దీనికి కారణం హీరోలు ఆలోచనా విధానం మారిందా లేక అభిమానుల ఒత్తిడా అనేది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. 1985లో స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డితో సంయుక్త […]