తెలుగుదేశంపార్టీ రెబల్ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు ఫ్రస్టేషన్ తెప్పిస్తున్నారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు బిల్లులపై మండలి సమావేశాలకు హాజరకావాలంటూ టీడీపీ జారీ చేసిన విప్‌ను ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ధిక్కరించారు. అప్పటి నుంచి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ శాసన మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై చైర్మన్ పలుమార్లు విచారణ జరిపారు. అయితే […]
ఇద్దరు టిడిపి ఎంఎల్సీలపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైందా ? శాసనమండలి కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనే ఇదే అనుమానం పెరిగిపోతోంది. శాసనమండలిలో రెండు అంశాలకు సంబంధించి జరిగిన ఓటింగ్ లో పార్టీ జారీ చేసిన విప్ ను ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేయాలంటూ కౌన్సిల్లో పార్టీ విప్ బుద్ధా వెంకన్న ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కు ఫిర్యాదుచేశాడు. ఆ నోటీసును బేస్ చేసుకుని ఛైర్మన్ ఆదేశాల ప్రకారం మండలి కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు ఎంఎల్సీలు […]