లైగర్ పంచాయితీ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళాక దర్శకుడు పూరి జగన్నాధ్ కు సెక్యూరిటీని జారీ చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. తనను డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్సియర్లు బెదిరిస్తున్నారని ఆ కారణంగా భద్రత కల్పించాలని పూరి విన్నవించుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే స్పందన రావడం గమనార్హం. మరోవైపు ఫిర్యాదులో అభియోగం మోపబడ్డ శోభన్ తాను గతంలో పూరికి ఎంతో సహాయం చేశానని, లైగర్ రిలీజైన రెండో రోజు నుంచే కాల్స్ లిఫ్ట్ చేయడం ఆపేయడం ఎంతవరకు న్యాయమని కొన్ని విషయాలు […]
అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత గుర్తొస్తోంది ఈ మధ్య కాలంలో కొన్ని డిజాస్టర్ల కథలు వింటుంటే. కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని కోట్ల రూపాయలు ముందు వెనుక చూడకుండా కుమ్మరించడం, తీరా అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యాక లబోదిబో మంటూ నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కంటెంట్ ఎలా ఉందో చూసుకోకుండా, కనీసం ట్రైలర్ చూశాక ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా పందెం కాస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. […]