అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అనే సామెత గుర్తొస్తోంది ఈ మధ్య కాలంలో కొన్ని డిజాస్టర్ల కథలు వింటుంటే. కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని కోట్ల రూపాయలు ముందు వెనుక చూడకుండా కుమ్మరించడం, తీరా అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలయ్యాక లబోదిబో మంటూ నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కంటెంట్ ఎలా ఉందో చూసుకోకుండా, కనీసం ట్రైలర్ చూశాక ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా పందెం కాస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. […]
నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన లైగర్ రెండో రోజే చాలా డౌన్ అయిపోయింది. విడుదల ముందు వరకు విపరీతమైన ప్రమోషన్లు చేసిన టీమ్ ఉన్నట్టుండి సైలెంటయ్యింది. విజయ్ దేవకొండ ట్వీట్లు వేయడం కూడా ఆపేశాడు. ఎంత ఫ్లాప్ అయినా కనీసం ఓ వారం రోజుల పాటు ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ సినిమాకు బూస్ట్ ఇవ్వడం అందరు హీరోలు చేసేదే. కానీ దానికి భిన్నంగా విజయ్ ఇలా మౌనం వహించడం అభిమానులు […]
అర్జున్ రెడ్డితో అనూహ్యమైన బ్లాక్ బస్టర్, గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ తో యూత్ లో అశేషమైన ఫాలోయింగ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండకు ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ఏదో పెద్ద బ్రేక్ వస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. బయట చూపించే యాటిట్యూడ్ మీద కామెంట్స్ ఉన్నప్పటికీ తన తీరే ఇంత అనేలా ప్రవర్తించే రౌడీ హీరో మొదటి సారి ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ అయిన సినిమా లైగర్. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ […]