మండలి డిప్యూటీ ఛైర్మన్గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలుపొందిన సుబ్రహ్మణ్యంకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్గా అవకాశం కల్పించారు. ఎర్రబుగ్గకారుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్ లభించిన సుబ్రహ్మణ్యంది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు పరిధిలోని కొత్తపేట సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరపున చిర్ల గడ్డిరెడ్డి 2014లో గెలుపొందడంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన […]