రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆయన అడిగిన పనిని చేసిపెట్టింది. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన సమయంలోనే వైఎస్సార్సీపీ ఎంపీ అడిగిన కీలకమైన పనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయడం విశేషం. ఇంతకూ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ఏం అడిగారంటే… తెలుగు రాష్ట్రాల సీబీఐ వ్యవహారాలను పర్యవేక్షించే సీబీఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్(జేడీ)గా తెలుగేతరులను నియమించాలని విజయసాయి రెడ్డి కోరారు. […]