తెలుగు సినిమా ప్రస్థానంలో వర్మ పేరుకో ప్రత్యేకమైన పేజీ ఉంది. ఇప్పుడెలాంటివి తీస్తున్నాడన్నది పక్కన పెడితే శివతో ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మాత్రం వర్మనే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1989లో శివ రిలీజైనప్పుడు ఎవరీ కుర్రాడని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంది. తమకూ అలాంటి సినిమా తీసిపెట్టామని బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు క్యూలు కట్టారు. కానీ శివ హిందీ రీమేక్ తర్వాత కొంత టైం తీసుకున్న వర్మ వెంకటేష్-శ్రీదేవి ఫస్ట్ టైం కాంబినేషన్ […]
1990లో క్షణక్షణం సినీమా షూటింగ్ రోజులవి. అన్నపూర్ణ స్టూడియోలో సంగీత దర్శకుడు కీరవాణి గారి సిట్టింగు జరుగుతోంది. తను ఒక అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లేందుకు కారు కావాలని ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ గా పని చేస్తున శివనాగేశ్వరరావుని అడిగారట. ఆయన ప్రోడక్షన్ కారును, డ్రైవరుని ఏర్పాటు చేసారట. బయటకు వెళ్లిన కీరవాణి 10 నిమిషాల్లో వచ్చేసి మ్యూజిక్ సిట్టింగులోకి వెళ్లిపోయారు. నేరుగా కీరవాణినే అడగగలిగినా శివనాగేశ్వరరావు డ్రైవర్ని పిలిచి “ఎక్కడికి తీసుకెళ్లావు?” అని అడిగారు. […]