ఒక హీరోకు స్టార్ స్టేటస్ వచ్చాక ప్రయోగాలు చేయడం అరుదు. అందులోనూ సౌత్ లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ పరిశ్రమలో మన తారలు రిస్క్ చేసేందుకు ఇష్టపడరు. బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎలా అవుతోంది లాంటి లెక్కలు తప్ప ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళను వ్రేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అలాంటి వారిలో అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారికి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలురంగాల్లో […]
1973. మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ అందించిన విజయ సంస్థకు ఒకదశలో ఫ్లాపులు పలకరించాయి. ఎన్నో అంచనాలు ఖర్చుతో తీసిన ‘ఉమా చండి గౌరీ శంకరుల కథ’ తీవ్రంగా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. అయిదేళ్ళు గడిచాక హిందీలో హేమమాలిని నటించిన ‘సీత ఔర్ గీత’ బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత చక్రపాణిగారిని ఆకర్షించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సంకల్పించుకున్నారు. అదే గంగ మంగ. నిజానికిది కొత్త కథ కాదు. […]
దశాబ్దాలు గడుస్తున్నా ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ కున్న పాపులారిటీ ఇప్పటికీ చూస్తున్నాం. ఇటీవలే వచ్చిన నో టైం టు డైకు ఇండియాలోనూ మంచి స్పందన దక్కడం దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే తెలుగులో ఈ కాన్సెప్ట్ ని మొదటిసారి అందిపుచ్చుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ విశేషాలు చూద్దాం. 1964 సంవత్సరం. నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీలు ఈ గూఢచారిని తెలుగు నేలమీదకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఫ్రెంచ్ లో […]
1977 సంవత్సరం. మే 27న విడుదలైన హిందీ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏ థియేటర్లో చూసిన జనం జాతర. ఏ రాష్ట్రంలో చూసినా కలెక్షన్ల రికార్డులు. అమితాబ్ బచ్చన్ – వినోద్ ఖన్నా – రిషి కపూర్ ల కాంబోలో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం దక్కింది. చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే […]
స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు నటిస్తే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ఎలాంటి అంచనాలు ఉంటాయో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్ఆర్-నాగార్జున, చిరంజీవి-రామ్ చరణ్ ఇలాంటి కాంబోలు మంచి హిట్లు అందుకున్న దాఖలాలు ఎన్నో. కానీ ప్రతిసారి ఖచ్చితంగా ఇవి హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి అంచనాలు విపరీతమైపోయి దారుణమైన ఫలితాలు దక్కొచ్చు. అదెలాగో చూద్దాం. 2000 సంవత్సరం. ‘రాజకుమారుడు’తో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న మహేష్ బాబుకు రెండో […]
కాలం ఎప్పుడైనా మల్టీ స్టారర్స్ కు ఉండే క్రేజే వేరు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తే తెరమీద చూస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. 1978 సంవత్సరం. విజయనిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఇమేజ్ ఉన్న ఇద్దరు కథానాయకులు దానికి కావాలి. తనతో పాటు శోభన్ బాబు అయితే బాగుంటుందని భావించి రచయిత మహారథిని పంపించి ఆయనకు వినిపించారు. ముందు ఓకే చెప్పిన అందాల […]
మనకు సూపర్ స్టార్ అంటే ముందు గుర్తొచ్చేది కృష్ణ ఆ తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబు. అలాగే తమిళంలో ఈ బిరుదు దశాబ్దాల తరబడి కిరీటంలా ధరించిన హీరో రజినీకాంత్. ఈ ఇద్దరు సీనియర్ల కాంబో అంటే ఖచ్చితంగా ఆసక్తి కలిగించే విషయమే. అప్పట్లో ఇది పలుమార్లు సాధ్యమయ్యింది. మచ్చుకొకటి చూద్దాం. కృష్ణ-రజని కాంబినేషన్లో వచ్చిన అన్నదమ్ముల సవాల్(1978)మంచి విజయం సాధించింది. ఇదే జోడితో మరో సినిమా తీయాలని నిర్మాతలు ప్రసాదరావు, శశిభూషణ్ లు రచయిత […]
సినిమాల్లో ట్రిపుల్ రోల్ చాలా అరుదు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, అప్పుడెప్పుడో చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు, అంతకుముందు అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ లాంటివి తప్ప మరీ గుర్తుంచుకోదగ్గవి చాలా తక్కువ. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ అలాంటి చెప్పుకోదగ్గ చిత్రం ఒకటుంది. ఆ ముచ్చట్లు చూద్దాం. 1969 తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా ‘దైవ మగన్’ వచ్చింది. ఏసి త్రిలోకచందర్ దర్శకులు. కమర్షియల్ గానూ ఈ మూవీ గొప్ప విజయం అందుకుంది. […]