iDreamPost

Vamsi : కాంబినేషన్ సూపర్ ఫలితం పంచర్

2000 సంవత్సరం. 'రాజకుమారుడు'తో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న మహేష్ బాబుకు రెండో సినిమా 'యువరాజు' మరీ గొప్ప ఫలితాన్ని అందివ్వకపోయినా బయ్యర్లను తీవ్ర నష్టాలు పాలు కాకుండా కాపాడింది. ఆ సమయంలో కృష్ణ-మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది పద్మాలయ అధినేతలకు.

2000 సంవత్సరం. 'రాజకుమారుడు'తో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న మహేష్ బాబుకు రెండో సినిమా 'యువరాజు' మరీ గొప్ప ఫలితాన్ని అందివ్వకపోయినా బయ్యర్లను తీవ్ర నష్టాలు పాలు కాకుండా కాపాడింది. ఆ సమయంలో కృష్ణ-మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది పద్మాలయ అధినేతలకు.

Vamsi : కాంబినేషన్ సూపర్ ఫలితం పంచర్

స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి తండ్రి కొడుకులు నటిస్తే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ఎలాంటి అంచనాలు ఉంటాయో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్-బాలకృష్ణ, ఏఎన్ఆర్-నాగార్జున, చిరంజీవి-రామ్ చరణ్ ఇలాంటి కాంబోలు మంచి హిట్లు అందుకున్న దాఖలాలు ఎన్నో. కానీ ప్రతిసారి ఖచ్చితంగా ఇవి హిట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి అంచనాలు విపరీతమైపోయి దారుణమైన ఫలితాలు దక్కొచ్చు. అదెలాగో చూద్దాం. 2000 సంవత్సరం. ‘రాజకుమారుడు’తో సూపర్ హిట్ డెబ్యూ అందుకున్న మహేష్ బాబుకు రెండో సినిమా ‘యువరాజు’ మరీ గొప్ప ఫలితాన్ని అందివ్వకపోయినా బయ్యర్లను తీవ్ర నష్టాలు పాలు కాకుండా కాపాడింది.

ఆ సమయంలో కృష్ణ-మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది పద్మాలయ అధినేతలకు. స్వంత బ్యానర్ కావడంతో బడ్జెట్ పరిమితులు పెట్టుకోకుండా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇవ్వాలనే లక్ష్యంతో కథల అన్వేషణ మొదలుపెట్టారు. రచయిత సత్యానంద్ చెప్పిన లైన్ అందరికీ నచ్చేయడంతో దానికి మాటలు సమకూర్చే బాధ్యతను పరుచూరి బ్రదర్స్ కు అప్పగించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాన్నతో కలిసి ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117 లాంటి సూపర్ హిట్స్ లో నటించిన మహేష్ కి తాను హీరో అయ్యాక తండ్రితో కలిసి చేయడమనే ఆలోచన గొప్ప ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది. అందుకే వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టారు. ‘సమరసింహారెడ్డి’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బి గోపాల్ ని దర్శకుడిగా ఎంచుకున్నారు. దీనికి పన్నెండేళ్ల ముందే ఇలాంటి సెటప్ తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’ హ్యాండిల్ చేసిన అనుభవం ఆయనది.

హీరోయిన్ గా ఎంపికైన నమ్రతా శిరోద్కర్ తో మహేష్ ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లేలా పునాది పడింది వంశీ షూటింగ్ లోనే. మణిశర్మ ఎప్పటిలాగే మరో పవర్ ఫుల్ ఆల్బమ్ సిద్ధం చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్, ఇంటర్వెల్ నుంచి కృష్ణ పాత్రను ఎంటర్ చేయించి అక్కడి నుంచి రివెంజ్ టచ్ తో కొంచెం సీరియస్ డ్రామా నడిపించారు బి గోపాల్. రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ తో రాజీ లేకుండా కోట్లాది రూపాయలతో వంశీ రూపొందింది. 2000 అక్టోబర్ 4 విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేక ఫ్లాప్ మూటగట్టుకుంది. కొత్తదనం లేని కథాకథనాలు, మూస ఫార్ములా గట్టెక్కించలేకపోయాయి. సరిగ్గా 10 రోజుల గ్యాప్ తో రిలీజైన నువ్వే కావాలి సునామి దెబ్బకు వంశీని రెగ్యులర్ ఆడియన్స్ దూరం పెట్టేశారు. ఫలితం అరుదైన కలయిక ఇలా వృధా అయ్యింది

Also Read : Mayuri : నిజమైన బయోపిక్ అంటే ఇది – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి