iDreamPost

Ganga Manga : రాముడు భీముడు ఫార్ములాతో హీరోయిన్ సినిమా – Nostalgia

ఎన్నో అంచనాలు ఖర్చుతో తీసిన 'ఉమా చండి గౌరీ శంకరుల కథ' తీవ్రంగా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. అయిదేళ్ళు గడిచాక హిందీలో హేమమాలిని నటించిన 'సీత ఔర్ గీత' బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత చక్రపాణిగారిని ఆకర్షించింది.

ఎన్నో అంచనాలు ఖర్చుతో తీసిన 'ఉమా చండి గౌరీ శంకరుల కథ' తీవ్రంగా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. అయిదేళ్ళు గడిచాక హిందీలో హేమమాలిని నటించిన 'సీత ఔర్ గీత' బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత చక్రపాణిగారిని ఆకర్షించింది.

Ganga Manga : రాముడు భీముడు ఫార్ములాతో హీరోయిన్ సినిమా – Nostalgia

1973. మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్స్ అందించిన విజయ సంస్థకు ఒకదశలో ఫ్లాపులు పలకరించాయి. ఎన్నో అంచనాలు ఖర్చుతో తీసిన ‘ఉమా చండి గౌరీ శంకరుల కథ’ తీవ్రంగా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. అయిదేళ్ళు గడిచాక హిందీలో హేమమాలిని నటించిన ‘సీత ఔర్ గీత’ బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాత చక్రపాణిగారిని ఆకర్షించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని సంకల్పించుకున్నారు. అదే గంగ మంగ. నిజానికిది కొత్త కథ కాదు. ‘రాముడు భీముడు’లోని హీరో పాత్రలను స్వభావాలు మార్చకుండా హీరోయిన్ కు అన్వయించి హిందీలో రాసుకున్నారు అంతే. ఈ కారణంగానే ఎక్కడ కోర్టు చిక్కులో పడతానోనని భయపడుతున్న దర్శక నిర్మాత జిపి సిప్పి హక్కులు అడగ్గానే హక్కులు ఉచితంగా ఇచ్చేశారు.

అలా గంగ మంగ మొదలయ్యింది. తొంభై సినిమాలు దాటాక కృష్ణకు విజయ బ్యానర్ లో అవకాశం రావడంతో ఆనందంగా ఒప్పుకున్నారు. అటుపక్క శోభన్ బాబుది కూడా ఇదే ఫీలింగ్ . టైటిల్ రోల్ కు అప్పటికే టాప్ పొజిషన్ లో వెలిగిపోతున్న వాణిశ్రీని ఎంచుకున్నారు. తొలుత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నది తాపీ చాణక్య. అయితే షూటింగ్ సగంలో ఉండగా ఆయన కన్నుమూయడంతో వి రామచంద్రరావు పూర్తి చేశారు. టైటిల్ కార్డులో ఇద్దరి పేర్లు ఉంటాయి. చంద్రమోహన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయగా సూర్యకాంతం గయ్యాళిగా, రేలంగి సౌమ్యుడైన ఆవిడ భర్తగా తమ హిట్ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేశారు. డివి నరసరాజు సంభాషణలు సమకూర్చారు. మిక్కిలినేని, వై విజయ, ఛాయాదేవి, సీతారాం ఇతర తారాగణం.

మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు మంచి స్వరాలతో కూడిన ఆల్బమ్ ని సిద్ధం చేశారు. టిఎం సుందరబాబు ఛాయాగ్రహణం అందించారు. కృష్ణ బస్తీలో నివసించే మాస్ పాత్రలో కనిపించగా డాక్టర్ పాత్రలో శోభన్ బాబు చక్కగా ఒదిగిపోయారు. తమిళంలో వాణి రాణిగా సమాంతరంగా షూటింగ్ చేశారు. అందులోనూ వాణిశ్రీనే నటించారు. రెండు పూర్తి వ్యతిరేక పాత్రల్లో ఆవిడ అభినయానికి జనం సూపర్ హిట్ సక్సెస్ అందించారు. 1973 నవంబర్ 30న విడుదలైన గంగ మంగ ఘన విజయం అందుకుంది. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని 1989లో శ్రీదేవితో ‘చాల్ బాజ్’గా హిందీలో మళ్ళీ రీమేక్ చేశారు. అందులో రజనీకాంత్, సన్నీ డియోల్ హీరోలు.

Also Read : Ghatothkachudu : హీరోయిన్ ని ప్రేమించే రోబో కాన్సెప్ట్ మనదే – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి