iDreamPost

భర్తల్ని మార్చే భార్యలన్నఈరోజుల్లో.. ఈ మంచి ఇల్లాలికి ఇంతటి కష్టమా?

ఈ దంపతులది అన్యోన్యమైన దాంపత్యం. కానీ వీళ్లకు పిల్లలు లేరు. కానీ ఆమె ఏనాడు భర్తను వీడి ఉండలేడు. అలాగే భార్య అంటే అంతే ప్రేమగా ఉన్నాడు భర్త కూడా. కానీ చివరికి

ఈ దంపతులది అన్యోన్యమైన దాంపత్యం. కానీ వీళ్లకు పిల్లలు లేరు. కానీ ఆమె ఏనాడు భర్తను వీడి ఉండలేడు. అలాగే భార్య అంటే అంతే ప్రేమగా ఉన్నాడు భర్త కూడా. కానీ చివరికి

భర్తల్ని మార్చే భార్యలన్నఈరోజుల్లో.. ఈ మంచి ఇల్లాలికి ఇంతటి కష్టమా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న భార్యా భర్తలకు చాన్నాళ్ల క్రితం పెళ్లైయ్యింది. అయితే పిల్లలు లేరు. కానీ ఏ రోజు బాధపడలేదు భార్య. ఏ రోజు అయినా తన కడుపు పండుతుందని ఆశపడింది. మొక్కని దేవుడు లేడు. తిరగని గుడులు లేవు. ఎంతకాలానికి పిల్లలు కలుగకపోవడంతో బాధను దిగమింగుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారు దంపతులు. భర్తలో పిల్లాడ్ని చూసుకుంటూ జీవిస్తోంది భార్య. అయితే ఇటీవల ఓ గుడిలో తిరణాళ్లు ఉన్నాయని తెలియడంతో ఇద్దరు కలిసి వెళ్లారు. అమ్మవారి దర్శనం చేసుకుని, తిరిగి వస్తుండగా.. ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యా భర్తలు ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది.

తేని జిల్లా కంపం మంతయ్యమ్మన్ గుడి వీధికి చెందిన నల్లతంబి, భార్య రమ్య భార్యా భర్తలు. సొంతంగా ఆటో నడుపుతూ ఉండేవాడు. వీరికి వివాహమై 11 ఏళ్లు అవుతోంది. అయితే పెళ్లైన కొత్తలో పిల్లలు లేరన్న బాధలో ఉండిపోయారు. ఎన్నో దేవుళ్లకు మొక్కారు. ఎన్నో దేవాలయాలను సందర్శించారు. కానీ పిల్లలు కలగలేదు. ఆ బాధలో జీవనాన్ని సాగిస్తుండగా.. ఇటీవల తేనీ సమీపంలోని వీరపాండి గౌమారియమ్మన్ దేవాలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు పిలవడంతో.. ఆటోలో కంబం నుండి గౌరియమ్మన్ ఆలయానికి వెళ్లేవారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి బయలు దేరారు.

కంబం వైపుగా ఆటోలో వస్తుండగా.. మధురై వెళుతున్న ప్రభుత్వ బస్సును ఢీ కొట్టింది. కె. పుదుపట్టి ప్రైవేట్ స్కూల్ సమీపంలోకి రాగానే ఎదురెదుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నల్లతంబి అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య రమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే భార్యను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యులు లేకపోవడంతో తేనిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే కన్నుమూసింది రమ్య. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభుత్వ బస్సు డ్రైవర్ మురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గుడికి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు.. అనంత లోకాలకు వెళ్లారని తెలిసి.. కన్నీరుమున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి