iDreamPost

చాలా డిఫరెంట్ గా మహేష్ ప్లాన్స్

చాలా డిఫరెంట్ గా మహేష్ ప్లాన్స్

సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగానే కాక దర్శకుడిగా నిర్మాతగా అద్భుత విజయాలు సాధించారు . తెలుగు సినిమాకు ఎన్నో కొత్త ప్రయోగాలకు బాటలు వేసి నవతరానికి స్ఫూర్తి గా నిలిచారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ మీద అల్లూరి సీతారామరాజు లాంటి అన్ని మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఒకవైపు షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా నిర్మాణ వ్యవహారాలు కూడా సోదరుడు ఆదిశేషగిరిరావు సహాయంతో క్రమం తప్పకుండా చూసుకునేవారు. అందుకే ఎన్టీఆర్ స్థాపించిన రామకృష్ణ సినీ స్టూడియోస్ కు ధీటుగా పద్మాలయను నిలపగలిగారు. అయితే కృష్ణ గారు దాదాపుగా ఆయన నటించిన సినిమాలనే నిర్మించుకొనేవారు.

కానీ ప్రిన్స్ మహేష్ బాబు దానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. జిఎంబి అంటే ఘట్టమనేని మహేష్ బాబు అంటూ తన పేరు మీద సంస్థను స్థాపించిన మహేష్ ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట ఇలా యాక్టివ్ భాగస్వామ్యాలతో ప్రొడక్షన్ చేసుకుంటూ వచ్చారు. అయితే తను మాత్రమే కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించేలా మహేష్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా రూపొందుతున్న మేజర్ షూటింగ్ సగానికి పైగా అయిపోయింది. లాక్ డౌన్ లేకపోతే ఆగస్ట్ 15 విడుదలయ్యేది. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు.దీనికి తక్కువ బడ్జెట్ పెట్టడం లేదు. సోనీతో కలిసి సుమారు పాతిక కోట్ల దాకా కేటాయించినట్టు సమాచారం. ఇది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారు.

ఇవి కాకుండా విజయ్ దేవరకొండ, నానిలతో కూడా మహేష్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. తాను ఆయా సినిమాల్లో లేకపోయినా ఒక బ్రాండ్ గా క్వాలిటీ సినిమాలు తీసేలా రెగ్యులర్ గా ప్రొడక్షన్ హౌస్ ని యాక్టివ్ గా ఉంచుతారట. నాన్న పద్మాలయను తన ఫ్యామిలీకి మాత్రమే కేటాయించినట్టు కాకుండా అందరితో తీసి దాన్ని మించిన అగ్ర నిర్మాణ సంస్థగా జిఎంబిని రూపుదిద్దాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎఎంబి మాల్ తో మల్టీ ప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అయిన మహేష్ దాన్ని కూడా ఎక్స్ పాండ్ చేసే దిశగా ప్రణాళికలు వేస్తున్నాడట. మొత్తానికి బిజినెస్ మెన్ టైటిల్ కు సార్ధకం చేకూరుస్తు రియల్ లైఫ్ లో కూడా మహేష్ చూపిస్తున్న దూకుడు మాములుగా లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి