iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలోనే సినీ దిగ్గజాలను కోల్పోయింది ఇండియన్ పరిశ్రమ. తాాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు.

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెలలోనే సినీ దిగ్గజాలను కోల్పోయింది ఇండియన్ పరిశ్రమ. తాాజాగా ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచి.. ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రముఖులు కన్నుమూసిన సంగతి విదితమే. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలు మరణించారు. ఈ నెలలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానిక్ నటులు మృతి చెందారు. అలాగే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి కనకలత తుదిశ్వాస విడిచారు. మాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరి కుమార్ క్యాన్సర్‌తో మరణించాడు. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కన్నుమూశారు. మాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించి తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు ఇక లేరు.

ప్రముఖ డైరెక్టర్ సంగీత్ శివన్.. మే 8న మరణించారు. మోహన్ లాల్‌ను స్టార్ హీరోగా మార్చిన దర్శకుడు ఆయన. రఘువరన్ హీరోగా వ్యూహం అనే మలయాళ చిత్రంతో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ చేసిన సంగీత్.. మోహన్ లాల్ యోధతో హిట్ అందుకున్నాడు.  డాడీ, గంధర్వన్, జానీ, నిర్ణయం వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు.  మోహన్ లాల్‌తో మూడు సినిమాలు చేశాడు.  ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టాడు. సన్నీడియోల్, సుస్మితా సేన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన జోర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వరుసగా హిందీ చిత్రాలు చేస్తూ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో హిట్టైన అతడు.. హిందీలో ఏక్-ద పవర్ ఆఫ్ వన్ పేరుతో రీమేక్ చేశాడు ఈ దర్శకుడు. ఇక మాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అందుకున్న రోమన్ చామ్ చిత్రాన్ని బాలీవుడ్‌లోకి రీమేక్ చేశాడు.

కప్కాపీ పేరుతో తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఇటీవల పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ ఈ మూవీ రిలీజ్ కాకుండానే ఆయన మరణించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ సంతోష్ శివన్.. ఈ సంగీత్ శివన్‌కు స్వయానా సోదరుడు. సంగీత్‌కు భార్య జయశ్రీ, పిల్లలు సంజన, శంతను ఉన్నారు. కాగా, ఆయన మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఆయన మరణ వార్త తెలిసి బాలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ రెండు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్ ముఖ్ తన సోషల్ మీడియాలో సంగీత్ చిత్రాన్ని పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి