iDreamPost

Hardik Pandya: ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో కలకలం.. అసలేం జరుగుతుందంటే?

ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. ఈ నేపథ్యంలో ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో యుద్ధవాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. ఈ నేపథ్యంలో ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో యుద్ధవాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Hardik Pandya: ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో కలకలం.. అసలేం జరుగుతుందంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో దారుణ ప్రదర్శన కనబర్చిన టీమ్స్ లో ముంబై ఇండియన్స్ టీమ్ ఒకటి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ సీజన్ లో పూర్తిగా విఫలం అయ్యింది. ఐదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని, పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంతోనే ముంబైకి ఈ గతిపట్టిందని ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాండ్యా కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆటగాళ్లతో పాటుగా అతడు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ గా ఉండటం లేదని వారు చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో కలకలం రేగుతోందని తెలుస్తోంది. అసలు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతుందంటే?

ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా నియమించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం పూర్తిగా మారిపోయినట్లు కథనాలు వస్తున్నాయి. అదీకాక ఇటీవల ఓ మ్యాచ్ లో ముంబై ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ లాంటి సీనియర్ ఆటగాళ్లు అందరూ కలిసి తమకు ప్రధాన సమస్యగా ఉన్న అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా సీనియర్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా ముంబై మేనేజ్ మెంట్ తో తమ ప్రాబ్లెమ్స్ ను షేర్ చేసుకున్నట్లుగా సమాచారం.

Mumbai Indians

ఈ నేపథ్యంలో ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన మ్యాచ్ లో అద్బుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ తిలక్ వర్మపై పాండ్యా విమర్శలు చేయడం, ముంబై ఓటమికి కారణం అతడే అనడం, అక్షర్ పటేల్ బ్యాటింగ్ పై కూడా కామెంట్స్ చేయడంతో.. జట్టులో వాతావరణం ఇంకా వేడెక్కింది. అద్భుతంగా రాణించినా.. ఓటమిని తిలక్ పై నెట్టేయడంతో పాండ్యాపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు టీమ్ రెండు గ్రూప్ లుగా విడిపోవడం వంటి పరిస్థితుల కారణంగా ముంబై డ్రెస్సింగ్ రూమ్ లో అనుకూల వాతావరణం లేనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూప్ లుగా విడిపోయి ఓ యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది.

అయితే ఈ విషయంపై ముంబై జట్టు అధికారి ఒకరు స్పందించినట్లు తెలుస్తోంది. “ఏ ఆటలో అయిన నాయకత్వ మార్పు చోటుచేసుకుంటే.. కొన్ని కొన్నిసార్లు ఇలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురౌతాయి. ఇది సహజం. అయితే రోహిత్ సారథ్యంలో 10 సంవత్సరాలు ఆడిన జట్టు ఒక్కసారిగా మరో వ్యక్తి కెప్టెన్సీలో ఆడటానికి కాస్త టైమ్ పడుతుంది. కొత్త మార్పును అంగీకరించడానికి ఆటగాళ్లు ఇంకా సిద్దపడలేదు. ఇది త్వరలోనే సర్ధుకుంటుందని అనుకుంటున్నాను” అంటూ ఆ అధికారి చెప్పుకొచ్చాడు. మరి ముంబై జట్టులో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి