iDreamPost

Ram Robert Rahim : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ లో కృష్ణ

చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే పరిస్థితి. అప్పట్లోనే మూడు అయిదు రూపాయల టికెట్ ధరలతో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండితుల మతులు పోగొట్టింది. అన్నదమ్ములు చిన్నప్పుడే విడిపోయే ఫార్ములాకి సరికొత్త రూపం ఇచ్చింది ఈ సినిమాలోనే

చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే పరిస్థితి. అప్పట్లోనే మూడు అయిదు రూపాయల టికెట్ ధరలతో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండితుల మతులు పోగొట్టింది. అన్నదమ్ములు చిన్నప్పుడే విడిపోయే ఫార్ములాకి సరికొత్త రూపం ఇచ్చింది ఈ సినిమాలోనే

Ram Robert Rahim : బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రీమేక్ లో కృష్ణ

1977 సంవత్సరం. మే 27న విడుదలైన హిందీ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సంచలన విజయం సాధించి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏ థియేటర్లో చూసిన జనం జాతర. ఏ రాష్ట్రంలో చూసినా కలెక్షన్ల రికార్డులు. అమితాబ్ బచ్చన్ – వినోద్ ఖన్నా – రిషి కపూర్ ల కాంబోలో దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం దక్కింది. చాలా చోట్ల సిల్వర్ జూబ్లీ దాటినా హౌస్ ఫుల్ బోర్డులు పడే పరిస్థితి. అప్పట్లోనే మూడు అయిదు రూపాయల టికెట్ ధరలతో పది కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ పండితుల మతులు పోగొట్టింది. అన్నదమ్ములు చిన్నప్పుడే విడిపోయే ఫార్ములాకి సరికొత్త రూపం ఇచ్చింది ఈ సినిమాలోనే

ఇంత ల్యాండ్ మార్క్ గా నిలిచినప్పుడు రీమేక్ హక్కుల కోసం సహజంగానే డిమాండ్ ఏర్పడుతుంది. ముందుగా తమిళంలో ‘శంకర్ సలీం సైమన్’ గా పునఃనిర్మాణం చేశారు. అందులో క్రిస్టియన్ హీరో పాత్రను రజనీకాంత్ చేశారు. బాగానే ఆడింది. తెలుగులో ఎవరూ అంత సాహసం చేయలేకపోయారు. అమర్ అక్బర్ ఆంటోనీ వచ్చిన టైంలోనే సూపర్ స్టార్ కృష్ణ దీన్ని చూసి విపరీతంగా ఇష్టపడ్డారు కానీ అప్పటికప్పుడు తీసే పరిస్థితి లేకపోవడంతో కొంత ఆలస్యం చేశారు. తాను డేట్లు ఇచ్చిన నిర్మాత సూర్యనారాయణబాబుని హక్కులు కొనేందుకు పురమాయించారు. ఈయనెవరో కాదు స్వయానా బావమరిదే. దర్శకత్వ బాధ్యతను శ్రీమతి విజయనిర్మలకు అప్పగించారు. రజనీకాంత్ ను తమిళంలో చేసిన క్యారెక్టర్ కాకుండా ఇందులో రామ్ వేషం ఇచ్చారు.

తానెంతో ముచ్చటపడ్డ రాబర్ట్ పాత్రను కృష్ణ గారు ఎంచుకోగా మిగిలిన ముస్లిం హీరో కోసం చంద్రమోహన్ ని తీసుకున్నారు. శ్రీదేవి, సునీత, ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్లు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా మహారథి సంభాషణలు అందించారు. గోపికృష్ణ ఛాయాగ్రహణం తీసుకున్నారు. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువయ్యింది. 1980 మే 31 రామ్ రాబర్ట్ రహీం భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. ఆ సమయంలో తుఫాను ఉన్నా మొదటి వారం కలెక్షన్లు రికార్డులు సాధించాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ స్థాయిలో ఇదీ ఆడుతుందని నమ్మకం పెట్టుకున్న కృష్ణ అంచనా పూర్తిగా నెరవేరలేదు. ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది అంతే

Also Read : Divya Bharathi : దివ్యభారతి చివరి జ్ఞాపకం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి