iDreamPost

అయిదుగురు హీరోల పండగ రేసు – Nostalgia

అయిదుగురు హీరోల పండగ రేసు – Nostalgia

ఇప్పుడంటే ఓపెనింగ్స్ మాయలో పడిపోయి వేలాది థియేటర్లలో సినిమాలను విడుదల చేస్తూ కలెక్షన్లే పరమావధిగా చూస్తున్నాము కానీ ఒకప్పుడు లాంగ్ రన్ లు టార్గెట్ గా ఉండేవి. అందులోనూ సంక్రాంతి సీజన్ అంటే ఇప్పుడే కాదు దశాబ్దాల క్రితం కూడా పసందైన పోటీకి వేదికగా ఉండేది. నువ్వా నేనా అనే స్థాయిలో దిగ్గజ హీరోలు కాంపిటీషన్ కు సై అనేవారు. ఒక శాంపిల్ చూద్దాం. 1988. ఆ పండక్కు మొత్తం నాలుగు క్రేజీ మూవీస్ రేస్ లో నిలిచాయి. చిరంజీవి మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్ పెక్టర్ ప్రతాప్, కృష్ణ కలియుగ కర్ణుడు, వెంకటేష్ రక్త తిలకంలు పందెం కోళ్ల తరహాలో భారీ వసూళ్ల పందేనికి తెరతీశాయి. ఆ విశేషాలు చూద్దాం.

‘పసివాడి ప్రాణం’తో ఇండస్ట్రీ హిట్ కొట్టక చిరు చేసిన ‘స్వయంకృషి’ సక్సెస్ అనిపించుకోగా ‘జేబుదొంగ’ ఆశించిన విజయం సాధించలేదు. దాంతో ‘మంచిదొంగ’ మీద ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు బాలయ్య హ్యాట్రిక్ హిట్ల మీద ఉన్నారు. ప్రెసిడెంట్ గారు అబ్బాయి, మువ్వగోపాలుడు, భానుమతి గారి మొగుడు మంచి విజయాలు నమోదు చేశాయి. ఆ టైంలో చేసిందే ఇన్స్ పెక్టర్ ప్రతాప్. ఇక వెంకటేష్ కు అప్పటికింకా స్టార్ ఇమేజ్ రాలేదు కానీ ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి హిట్లతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర కావడంతో మొదటి మాస్ మూవీగా ‘రక్త తిలకం’ మీద మంచి హైప్ ఏర్పడింది. ఇక కృష్ణ ‘కలియుగ కర్ణుడు’ సైతం తక్కువేమి తినలేదు

ఇవి కాకుండా జనవరి 9నే శోభన్ బాబు ‘సంసారం’ రిలీజ్ కాగా, 14న మంచి దొంగ, కలియుగ కర్ణుడు, రక్తతిలకంతో అదే డేట్ కి ‘రాకీ’ అనే మరో చిన్న చిత్రం రిలీజ్ కాగా ఒక రోజు ఆలస్యంగా బాలయ్య 15న వచ్చారు. కమర్షియల్ లెక్కల్లో చూసుకుంటే అన్నీ మంచి లాభాలు ఇచ్చాయి కానీ కలియుగ కర్ణుడు క్రేజ్ కు తగ్గట్టు ఆడలేక వెనక్కు తగ్గి ఫ్లాప్ అయ్యింది. మంచి దొంగ వసూళ్లు భారీగా రాగా ఇన్స్ పెక్టర్ ప్రతాప్ సైతం వంద రోజులు షీల్డ్ అందుకుంది. రక్తతిలకం వెంకీ కోరుకున్న మాస్ ఇమేజ్ ని ఇవ్వడమే కాక బిసి సెంటర్లలో కూడా మంచి కలెక్షన్లు దక్కించుకుంది. మొత్తానికి ఆ పండగ సినిమా అభిమానులకు చేసిన కనువిందు అంతాఇంతా కాదు

Also Read : హింసతో పొత్తు కుదరని సెంటిమెంట్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి