iDreamPost

Goodhachari 116 : సూపర్ స్టార్ కృష్ణ ఎవర్ గ్రీన్ సాహసం

అయితే తెలుగులో ఈ కాన్సెప్ట్ ని మొదటిసారి అందిపుచ్చుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ విశేషాలు చూద్దాం. 1964 సంవత్సరం. నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీలు ఈ గూఢచారిని తెలుగు నేలమీదకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఫ్రెంచ్ లో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమా ఆధారంగా రచయిత ఆరుద్రగారిని మన ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్క్రిప్ట్ రాయించే బాధ్యతను అప్పగించారు.

దశాబ్దాలు గడుస్తున్నా ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ కున్న పాపులారిటీ ఇప్పటికీ చూస్తున్నాం. ఇటీవలే వచ్చిన నో టైం టు డైకు ఇండియాలోనూ మంచి స్పందన దక్కడం దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. అయితే తెలుగులో ఈ కాన్సెప్ట్ ని మొదటిసారి అందిపుచ్చుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ విశేషాలు చూద్దాం. 1964 సంవత్సరం. నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీలు ఈ గూఢచారిని తెలుగు నేలమీదకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఫ్రెంచ్ లో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమా ఆధారంగా రచయిత ఆరుద్రగారిని మన ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్క్రిప్ట్ రాయించే బాధ్యతను అప్పగించారు.

దర్శకుడిగా ఎం మల్లికార్జునరావును ఎంచుకున్నారు. కృష్ణకు అప్పటికింకా ఇమేజ్ రాలేదు. తేనెమనసులు హిట్ అయినా ఏ స్థాయికి వెళ్తారనే అంచనా ఎవరికీ లేదు. దేవుడే పంపించినట్టుగా వచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని కృష్ణ వదల్లేదు. సవాల్ ని స్వీకరించారు. టి చలపతిరావు మాస్ కి క్లాస్ కి కిక్కిచ్చే సూపర్ హిట్ పాటలతో మంచి ఆల్బమ్ సిద్ధం చేశారు. టెక్నికల్ గా ఎన్నో సవాళ్లు ఉన్న ఈ ప్రాజెక్ట్ కెమెరా మెన్ విఎస్ఆర్ స్వామిని వరించింది. జయలలిత హీరోయిన్ గా, రేలంగి-ముక్కామల-రావికొండలరావు- వెన్నిరాడై నిర్మల తదితరులు ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. ప్రారంభంలో వచ్చే చనిపోయే చిన్న పాత్రను శోభన్ బాబు పోషించారు. వీరాభిమన్యు నిర్మాత కావడంతో భేషజాలకు పోకుండా చేశారు.

అప్పట్లో విదేశీ సినిమాల తెలుగు డబ్బింగులు ఉండేవి కావు. దాంతో ఇంగ్లీష్ తదితర బాషా చిత్రాలు వచ్చినప్పుడు విజువల్ గా ఎంజాయ్ చేయడమే తప్ప కథ అర్థం కాక మన ఆడియెన్స్ బాగా ఇబ్బంది పడేవారు. అలాంటిది కృష్ణ గూఢచారి 116గా చేసిన ఫీట్లకు, తెరపై ఆవిష్కరించిన సరికొత్త అద్భుతాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బ్లాక్ అండ్ వైట్ లోనూ కలర్ ఫుల్ ని మించిన వండర్స్ కి సాహో అన్నారు. ఫలితంగా 1966 ఆగస్ట్ 11 విడుదలైన గూఢచారి 116 ఘన విజయం సాధించి సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. తర్వాత చిరంజీవి, సుమన్ లాంటి అగ్ర హీరోలు ఈ జానర్ ని ట్రయ్ చేసినా కృష్ణ మార్క్ మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచింది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ సంపాదించుకుంది

Also Read : Jaganmohini : ఒక తరాన్ని ఊపేసిన జగన్మోహిని – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి