నదీ జలాల వివాదంపై సంబంధిత బోర్డులు సమావేశం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నదీ జలాల వివాదం రాష్ట్ర విభజన నుంచి జరుగుతుంది. వివిధ సందర్భాల్లో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం సంప్రదింపులు ద్వారా నదీ జలాల వివాదానికి తాత్కాలిక ముగింపు జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నదీ జలాల వివాదంపై గతంలోనే సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై […]
కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నీళ్లను పూర్తిస్థాయిలో వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పింది. సోమవారం హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్తో ఏపీ జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్దేశాలను నిర్మొమహాటంగా తేల్చి చెప్పారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు […]