iDreamPost
android-app
ios-app

వేసవికి ఫిక్స్ అయిన మాస్ రాజా క్రాక్

  • Published Jan 26, 2020 | 5:55 AM Updated Updated Jan 26, 2020 | 5:55 AM
  • Published Jan 26, 2020 | 5:55 AMUpdated Jan 26, 2020 | 5:55 AM
వేసవికి ఫిక్స్ అయిన మాస్ రాజా క్రాక్

అభిమానులతో  పాటు తాను వ్యక్తిగతంగా ఎన్నో అంచనాలు పెట్టుకున్న డిస్కో రాజా నిరాశపరచడం పట్ల రవితేజ ఎలా ఫీలవుతున్నాడో తెలియదు కాని ఫ్యాన్స్ మాత్రం తెగ బాధ పడుతున్నారు. భారీ బడ్జెట్ తో డిఫరెంట్ స్టొరీ లైన్ తో డ్యూయల్ రోల్ తో తెరకెక్కినప్పటికీ ఆశించిన ఫలితం అందుకోలేదు సరికదా వరసగా నాలుగో డిజాస్టర్ ని హీరో ఖాతాలో వేసేసింది. ఇప్పుడు ఆశలన్ని రాబోయే క్రాక్ మీదకు షిఫ్ట్ అయ్యాయి. 

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరొయిన్ గా రూపొందుతున్న క్రాక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే 8న క్రాక్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాడు. దీనికీ తమనే సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ కాంబోలో ఇది 13వ సినిమా.పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ చిత్రం కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని సమాచారం. 

గతంలో గోపీచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో డాన్ శీను , బలుపు రెండు సూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్ యాంగిల్ లో అన్ని కరెక్ట్ గా సెట్ చేసుకున్న ఆ సినిమాలు హీరోకు కూడా బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడీ మూవీ హ్యాట్రిక్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. మే 8 అంటే ఇంకో మూడు నెలలు మాత్రమే టైం ఉంది. ఇంత షార్ట్ గ్యాప్ లో రవితేజ సినిమాలు రావడం అరుదు. కాటమరాయుడు తర్వాత టాలీవుడ్ కు దూరమైన శృతి హాసన్ కంబ్యాక్ చేస్తున్న మూవీ కూడా ఇదే. మరి మే 8న రాబోయే క్రాక్ అయినా అంచనాలు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş