ఎం.ఎ.షరీఫ్.. ఈ పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో విస్తృతంగా నానుతోంది. మీడియాలో పతాక శీర్షికల్లో వస్తోంది. రాజకీయ పార్టీల నేతలు , రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు.. ఇలా ప్రతి ఒక్కరి నోటా ఈ పేరు వినపడుతోంది. మండలి చైర్మన్గా ఉన్న ఎం.ఎ.షరీఫ్ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఆయన వార్తల్లో నిలిచారు. మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించక ముందు […]