దేశ వ్యాప్తంగా సంక్రాంతి శోభ సంతరించుకుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ నాలుగు రోజుల పాటు సాంప్రదాయకంగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో తమ స్వస్థాలకు ఇప్పటికే చేరుకున్నారు. మరికొందరు మార్గమధ్య ప్రయాణంలో ఉన్నారు. ప్రతియేటా మాదిరిగానే ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంక్రాంతి సందర్భంగా వచ్చే కోడిపందాల శోభ వచ్చేసింది. కత్తి కట్టకుండా వేసే కోడిపందాలను పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రారంభించారు. దీంతో సంక్రాంతి సంబరాలకు ఊపునిచ్చినట్టయింది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన […]